Wednesday, 25 December 2013
చౌదవీకా(చాంద్...కేలియె(... వేదనారవాలు వెంటతరుముతుంటె... ఘనీభవించిన చీకట్ల యేకాంతంలో యేమూలనో నక్కి, షరిత్పరిష్వంగపు శాంతిని వెతుక్కుందామన్నా, నీవాగ్విశిఖాలు యెదనుతాకి క్షణమైనా లగ్నం చేయనీయవు. భుజం భుజం కలిపి నీవెంట నడుస్తున్నా... నీప్రశ్నల పరంపరల చేతనావర్తనపు గానుగెద్దునయ్యాను. ఏడారిమేఘం యేమోడునో పలకరించినట్లు... నీఆదణకోసం యెదురుచూపు పక్కన నడుస్తున్నా...పక్కలోబల్లెమనుకొని నన్నెక్కడ అగాధానికి తొక్కేస్తావోయని యెదలొ సలపరింత. నీచెప్పు చేతల్లోనడుస్తూ అవస్తలు పడుతుంటే, అస్థిత్వపు స్వగతం జాలిగా నవ్వుకుంటుంది. ఇంత జరుగుతున్నా...నీకెందుకు సిగ్గురాదని చీపురుకట్ట తిరగేస్తుంటే దిల్లంతా బేచైనైతుంది. *** *** *** భాయీ!నన్ను శంకిస్తుంటావుగాని , శ్వేతవర్ణపు షేర్వాని ధరించి తలపై టోపీపెట్టి బహుత్ యీమానాద్మీల్లెక్క మసీదులోనొ ,మంజిల్లోనో, ఈద్విందు ఇచ్చినంత మాత్రాన అకస్మాత్తుగ శాంతికపోతమై పోలేవుకదా!. అలాయిబలాయి తీసుకున్నా అభద్రతాఖడ్గం వెంటాడినట్లేవుంది. అధరాల్లో బోంసాయి నవ్వుల్ల్ని రువ్వినంత మాత్రాన వున్నపళంగా దిల్షాద్ వైపోవు. శూలాలతో నెలవంకల్ని కూల్చిన గతమంతా యాదికొచ్చి చాంద్ కొ( ఘొరేహుయె(అంధేరా దూర్ హోకర్ చౌదవీ కా(చాంద్ కేలియే దువా కరూంగ తడప్ తడప్ .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment