Wednesday, 25 December 2013

మహొదయం కోసం

కవులకు కల్పన ఆధరాం

చౌదవీకా(చాంద్...కేలియె(... వేదనారవాలు వెంటతరుముతుంటె... ఘనీభవించిన చీకట్ల యేకాంతంలో యేమూలనో నక్కి, షరిత్పరిష్వంగపు శాంతిని వెతుక్కుందామన్నా, నీవాగ్విశిఖాలు యెదనుతాకి క్షణమైనా లగ్నం చేయనీయవు. భుజం భుజం కలిపి నీవెంట నడుస్తున్నా... నీప్రశ్నల పరంపరల చేతనావర్తనపు గానుగెద్దునయ్యాను. ఏడారిమేఘం యేమోడునో పలకరించినట్లు... నీఆదణకోసం యెదురుచూపు పక్కన నడుస్తున్నా...పక్కలోబల్లెమనుకొని నన్నెక్కడ అగాధానికి తొక్కేస్తావోయని యెదలొ సలపరింత. నీచెప్పు చేతల్లోనడుస్తూ అవస్తలు పడుతుంటే, అస్థిత్వపు స్వగతం జాలిగా నవ్వుకుంటుంది. ఇంత జరుగుతున్నా...నీకెందుకు సిగ్గురాదని చీపురుకట్ట తిరగేస్తుంటే దిల్లంతా బేచైనైతుంది. *** *** *** భాయీ!నన్ను శంకిస్తుంటావుగాని , శ్వేతవర్ణపు షేర్వాని ధరించి తలపై టోపీపెట్టి బహుత్ యీమానాద్మీల్లెక్క మసీదులోనొ ,మంజిల్లోనో, ఈద్విందు ఇచ్చినంత మాత్రాన అకస్మాత్తుగ శాంతికపోతమై పోలేవుకదా!. అలాయిబలాయి తీసుకున్నా అభద్రతాఖడ్గం వెంటాడినట్లేవుంది. అధరాల్లో బోంసాయి నవ్వుల్ల్ని రువ్వినంత మాత్రాన వున్నపళంగా దిల్షాద్ వైపోవు. శూలాలతో నెలవంకల్ని కూల్చిన గతమంతా యాదికొచ్చి చాంద్ కొ( ఘొరేహుయె(అంధేరా దూర్ హోకర్ చౌదవీ కా(చాంద్ కేలియే దువా కరూంగ తడప్ తడప్ .


Sunday, 8 January 2012

చౌదవీకా(చాంద్...కేలియె(...

వేదనారవాలు  వెంటతరుముతుంటె...
ఘనీభవించిన చీకట్ల యేకాంతంలో యేమూలనో నక్కి,
షరిత్పరిష్వంగపు శాంతిని వెతుక్కుందామన్నా,
నీవాగ్విశిఖాలు యెదనుతాకి క్షణమైనా లగ్నం చేయనీయవు.

భుజం భుజం కలిపి నీవెంట నడుస్తున్నా...
నీప్రశ్నల పరంపరల చేతనావర్తనపు గానుగెద్దునయ్యాను.
ఏడారిమేఘం యేమోడునో పలకరించినట్లు...
నీఆదణకోసం యెదురుచూపు

పక్కన నడుస్తున్నా...పక్కలోబల్లెమనుకొని
నన్నెక్కడ అగాధానికి తొక్కేస్తావోయని యెదలొ సలపరింత.
నీచెప్పు చేతల్లోనడుస్తూ అవస్తలు పడుతుంటే,
అస్థిత్వపు స్వగతం  జాలిగా నవ్వుకుంటుంది.
ఇంత జరుగుతున్నా...నీకెందుకు సిగ్గురాదని
చీపురుకట్ట తిరగేస్తుంటే దిల్లంతా బేచైనైతుంది.
          ***      ***            ***
భాయీ!నన్ను శంకిస్తుంటావుగాని ,
శ్వేతవర్ణపు షేర్వాని ధరించి తలపై టోపీపెట్టి
బహుత్ యీమానాద్మీల్లెక్క మసీదులోనొ ,మంజిల్లోనో,
ఈద్విందు ఇచ్చినంత మాత్రాన
అకస్మాత్తుగ శాంతికపోతమై పోలేవుకదా!.
అలాయిబలాయి తీసుకున్నా
అభద్రతాఖడ్గం వెంటాడినట్లేవుంది.

అధరాల్లో బోంసాయి నవ్వుల్ల్ని రువ్వినంత మాత్రాన
వున్నపళంగా దిల్షాద్ వైపోవు.
శూలాలతో నెలవంకల్ని కూల్చిన గతమంతా యాదికొచ్చి
చాంద్ కొ(  ఘొరేహుయె(అంధేరా దూర్ హోకర్
చౌదవీ కా(చాంద్ కేలియే దువా కరూంగ తడప్  తడప్ .              
                            

Tuesday, 3 January 2012

నులి వె చ్చని సూర్యోదయం .

నూతిలో గొంతుకల్తో గుసగసలాడితే్ నీగోడెవరికి వినబడ్తుంది నేస్తం!
తరాలు మారినా తలరాతలు మారలేదని దిగాలుపడ్తూ 
తరుణంకోసం ఎదురు చూస్తూ నిరీక్షి స్తె ఎలా?
లోకం కళ్ళకు గంతలు కడ్తున్నారని కలవరపడి లాభమేంటి ?
వేవేల ఆక్రందనా రాగాలు బధిరశంఖారావాలౌతున్నప్పుడైనా
శత్రువు అంతర్ముఖ క్రౌర్యాన్ని పసిగట్టాలిగదా!
 సమూహాన్ని సమకట్టి ప్రజాధనాన్ని గుత్తానికి నెట్టేసె
నయాజాదూగాళ్ళ పని పట్టాలిగదా!.
       888                    888                888.  
స్వార్ధపరిత్యాగ నాయకులకి కర్మభూమిలో కాలం చెల్లిందని
సగరమాంధాత్రాదుల పురాగానాల్ని నెమరు వేసుకుందామా?
ఆజన్మాంతర పాలకుల కల్లబొల్లి తాయిలాలకు 
సిగ్గువిడిసి సంబరాలు జరుపుకుందామా?
నాడు దేశభక్తికి మారుపేరై నినదించినఖద్దరులు 
నేడు గద్దలై నోటికాడ ముద్దల్ని తన్నుకు పోతుంటే
బండబారిన హృదయాల్తో కళ్ళప్పగించేద్దామా!
రచ్బబండ రాజకీయాల్నిఇకనైనా సమీక్షిద్దామా!
ఏంచేద్దాం.......మనమిప్పుడు.
సేవకు పరమార్ధం సొమ్ము కైంకర్యమని 
అభినవరాజ్యాంగాన్ని లిఖించుకుంటె పోలా?!.
           888                888           888
శుభకామనలు ఏమని పలుకుదాం...ఎవరికి పలుకుదాం.
నీతిశిఖరాలు కూలిపోతుంటే...హిమశిఖరాల్లా అవినీతి దర్శనమిస్తుంటె.
జీవికలోకిక ఆమనికి  చోటెక్కడిది ?
ప్రకృతికే తప్ప బ్రతుకులో లేని  మకర సంక్రమణాలకు 
ఓం కృతులెలా పాడగలం ?
కడుపులు కొట్టె విషనాగుల్నివోట్లతోనే కాక బూట్లతోనూ తరిమికొట్టిన నాడే,
జనజాగృతి గీతాలతో నులివెచ్చని సూర్యోదయాలకు స్వాగతాంజలి చెప్పగలం 
జనహృదయనేతలకు హారతులు పట్టగలం.