నూతిలో గొంతుకల్తో గుసగసలాడితే్ నీగోడెవరికి వినబడ్తుంది నేస్తం!
తరాలు మారినా తలరాతలు మారలేదని దిగాలుపడ్తూ
తరుణంకోసం ఎదురు చూస్తూ నిరీక్షి స్తె ఎలా?
లోకం కళ్ళకు గంతలు కడ్తున్నారని కలవరపడి లాభమేంటి ?
వేవేల ఆక్రందనా రాగాలు బధిరశంఖారావాలౌతున్నప్పుడైనా
శత్రువు అంతర్ముఖ క్రౌర్యాన్ని పసిగట్టాలిగదా!
సమూహాన్ని సమకట్టి ప్రజాధనాన్ని గుత్తానికి నెట్టేసె
నయాజాదూగాళ్ళ పని పట్టాలిగదా!.
888 888 888.
స్వార్ధపరిత్యాగ నాయకులకి కర్మభూమిలో కాలం చెల్లిందని
సగరమాంధాత్రాదుల పురాగానాల్ని నెమరు వేసుకుందామా?
ఆజన్మాంతర పాలకుల కల్లబొల్లి తాయిలాలకు
సిగ్గువిడిసి సంబరాలు జరుపుకుందామా?
నాడు దేశభక్తికి మారుపేరై నినదించినఖద్దరులు
నేడు గద్దలై నోటికాడ ముద్దల్ని తన్నుకు పోతుంటే
బండబారిన హృదయాల్తో కళ్ళప్పగించేద్దామా!
రచ్బబండ రాజకీయాల్నిఇకనైనా సమీక్షిద్దామా!
ఏంచేద్దాం.......మనమిప్పుడు.
సేవకు పరమార్ధం సొమ్ము కైంకర్యమని
అభినవరాజ్యాంగాన్ని లిఖించుకుంటె పోలా?!.
888 888 888
శుభకామనలు ఏమని పలుకుదాం...ఎవరికి పలుకుదాం.
నీతిశిఖరాలు కూలిపోతుంటే...హిమశిఖరాల్లా అవినీతి దర్శనమిస్తుంటె.
జీవికలోకిక ఆమనికి చోటెక్కడిది ?
ప్రకృతికే తప్ప బ్రతుకులో లేని మకర సంక్రమణాలకు
ఓం కృతులెలా పాడగలం ?
కడుపులు కొట్టె విషనాగుల్నివోట్లతోనే కాక బూట్లతోనూ తరిమికొట్టిన నాడే,
జనజాగృతి గీతాలతో నులివెచ్చని సూర్యోదయాలకు స్వాగతాంజలి చెప్పగలం
జనహృదయనేతలకు హారతులు పట్టగలం.

మీరా గారు,
ReplyDeleteచాలా ఆలోచనాభరితంగా & విప్లవాత్మకంగా వుంది మీ కవిత.
చదువుతుంటే శరీరం రోమాంచితం ఔతుంది.